మహిళల సంక్షేమానికి పెద్దపీట
● కలెక్టర్ రాజర్షిషా
ఆదిలాబాద్‌టౌన్: మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. మ హిళా దినోత్సవం పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మంగళవారం వేడుకలు నిర్వహించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మహిళల ఆరోగ్యంపై వైద్యులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆడ పిల్లల చదువును ప్రోత్సహించాలన్నారు. పని ప్రదేశాలు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో మహిళలను వేధింపులకు గురిచేస్తే చట్టప్రకారం చర్యలు తప్పవన్నారు. మహిళలు ఆర్థిక స్వా లంబన దిశగా ముందుకు సాగాలన్నారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ అన్నిరంగాల్లో మహిళలు ముందుకెళ్తున్నారని పేర్కొన్నారు. ఎక్కడైతే సీ్త్రలు గౌరవించబడతారో అక్కడ సమాజం సంతో షంగా ఉంటుందన్నారు. అనంతరం పలు స్వచ్ఛంద సంస్థలు, జిల్లా అధికారులను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ ఇన్‌చార్జి పీడీ మిల్కా, డీఈవో ప్రణీత, టీబీ నివారణ అధికారి డాక్టర్ సుమలత, మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వరిబాయి, మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ యశోద, సఖీ కేంద్రం నిర్వాహకురాలు సరస్వతి, నాగమణి, ఐసీడీఎస్ అధికారులు, సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు, వివిధ శాఖల ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment