‘ఎంపీ, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి’
ఆదిలాబాద్‌టౌన్: సీసీఐ ఫ్యాక్టరీ, ఎయిర్‌పో ర్టు విషయంలో స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, చేతకాకపోతే రాజీనామా చేయాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల స మావేశంలో ఆయన మాట్లాడారు. సీసీఐ పరిశ్రమను తుక్కు కింద అమ్మేయడానికి టెండర్లు ప్రకటించిన విషయాన్ని బయట పెట్టడంతో దానిపై వారిద్దరు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. ఎయిర్‌పోర్టు విషయంలో ఎంపీ చేసిన వ్యాఖ్యలు నిజమైతే తన స్వగ్రామమైన జాతర్లలోని శివాలయంలో ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. బీఆర్‌ఎస్‌పై లేనిపోని ఆరోపణలు చేస్తే సహించమన్నారు. తాను ప్రజాభిప్రాయానికి అనుగుణంగా అభివృద్ధి చేశానే తప్ప మోసపూరిత మాటలు చెప్పలేదని గుర్తు చేశారు. పరిశ్రమల విషయంలో యు వతతో పాటు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతున్నారన్నా రు. అబద్దాలతో కాలయాపన చేసే బదులు రాజీనామా చేయడం ఉత్తమమని హితబోధ చేశారు. 11 ఏళ్లుగా బీజేపీ కేంద్రంలో అధి కారంలో ఉన్నా సీసీఐ పరిశ్రమను పునః ప్రారంభించకపోవడం వారి అసమర్థతే కారణమన్నారు. వాటి సాధన కోసం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామన్నా రు. ఇందులో నాయకులు నారాయణ, అజ య్, ప్రహ్లాద్, రాజు, భూమన్న తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment