‘స్థానిక’ ఎన్నికలపై దృష్టి సారించండి
కై లాస్‌నగర్: స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీత క్క అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లా ముఖ్య నాయకులు, నియోజకవర్గ ఇన్‌చార్జీలతో మంత్రి హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం రాత్రి సమీక్ష నిర్వహించారు. రానున్న స్థాని క సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన కా ర్యాచరణపై వారికి దిశానిర్దేశం చేశారు. అన్ని నియోజవర్గాల్లో పార్టీని పటిష్టం చే యాలని, ప్రభుత్వ పథకాలను ప్రజల వద్ద కు తీసుకెళ్లాలని సూచించారు. గ్రామ పంచా యతీ, మండల, జిల్లా పరిషత్, మున్సి పల్ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు ఇప్పటినుంచే పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని సూ చించారు. ఇందులో ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు పటేల్, ప్రేమ్ సాగర్‌రావు, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలా చారి, మాజీ ఎంపీ సోయం బాపూరావ్, పార్టీ నేతలు విఠల్‌రెడ్డి, రేఖానాయక్, సత్తు మల్లేశ్, ఆత్రం సుగుణ, శ్రీహరిరావు, గజేందర్, శ్రీనివాసరెడ్డి తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment