ఆదిలాబాద్
29.51
మంచిర్యాల
41.09
ఆసిఫాబాద్
40.24
అడవుల విస్తరణ ఓకే
అడవుల విస్తరణలో ఉమ్మడి జిల్లా మెరుగ్గానే ఉంది. మొత్తం భూ భాగంలో మంచిర్యాలలో 41శాతం విస్తరించి ఉండగా, ఆదిలాబాద్‌లో 29.51శాతం ఉంది. రాష్ట్రంలో ములుగు జిల్లా 64.64శాతంతో మొదటి స్థానంలో ఉండగా, కరీంనగర్‌లో అత్యల్పంగా 2.29శాతమే ఉంది.
ఉమ్మడి జిల్లాలో క్రమంగా ఆర్థికవృద్ధి పెరుగుతున్న జీడీడీపీ, తలసరి ఆదాయం గత ఆర్థిక సర్వేతో పోలిస్తే తాజాగా కాస్త మెరుగు ‘తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం–2025’లో వెల్లడి
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: సామాజిక, ఆర్థిక రంగాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా క్రమంగా వృద్ధిలో పయనిస్తోంది. గతంతో పోలిస్తే మార్పు కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏటా బడ్జెట్ సందర్భంగా విడుదల చేసే సామాజిక ఆర్థిక ముఖచిత్రంలో ఈ విషయం స్పష్టమవుతోంది. గత 2024 (2022–23) సర్వేతో తాజాగా విడుదల చేసిన ఆర్థిక సంవత్సరాల (2023–24)తో పోల్చి చూసినప్పుడు ఈ మార్పులు వెల్లడవుతున్నాయి. కానీ.. రాష్ట్రంలో 33జిల్లాలతో పోలిస్తే నాలుగు జిల్లాలు ఇంకా అనేక అంశాల్లో వృద్ధి సాధించాల్సి ఉంది.
జీడీడీపీలో మార్పు
జిల్లా భూభాగంలో జరిగిన అంతిమ వస్తు సేవల విలువగా పేర్కొనే స్థూల జిల్లా జాతీయ ఉత్పత్తి (జీడీడీపీ)లో గతేడాది కన్నా పెరిగింది. అయితే రాష్ట్ర స్థాయిలో 33 జిల్లాల్లో ఉమ్మడి జిల్లా మొదటి పది స్థానాల్లో లేదు. ఇంకా ఈ ర్యాంకులు మెరుగుపడాల్సి ఉంది. అంటే స్థానికంగా ఉత్పాదక ఇంకా పెరగాల్సి ఉంది.
అటవీ విస్తరణ(శాతంలో)
అటవీ విస్తరణ(శాతంలో)