ఆదిలాబాద్‌టౌన్: ఇంటర్ పరీక్షలు ముగిశాయి. గురువారం చివరి పరీక్ష ముగియడంతో విద్యార్థులు పరస్పరం ఆటోగ్రాఫ్‌లు తీసుకున్నారు. వ సతి గృహాల్లో ఉండే విద్యార్థులు ఆనందంతో త ల్లిదండ్రులతో ఇంటిబాట పట్టారు. దీంతో జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతం రద్దీగా మారింది. ఈసారి పరీక్షలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. మాస్‌కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా సంబంధిత అధికారులు పరీక్షలను పకడ్బందీగా నిర్వహించారు. ఏ ఒక్క విద్యార్థి కూడా పరీక్షల్లో డిబార్ కాకపోవడం గమనార్హం.
నేటి నుంచి వాల్యుయేషన్..
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో శుక్రవారం నుంచి మొదటివిడత ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనాన్ని నిర్వహించనున్నారు. ఇందుకోసం డీఐఈవో జాదవ్ గణేశ్ ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటిరోజు తెలుగు, హిందీ, ఇంగ్లిష్, గణితం, పౌరశాస్త్రం సబ్జెక్టులకు సంబంధించి మూల్యాంకనం చేపట్టనున్నారు. ఇ ప్పటికే ఆయా జిల్లాల నుంచి జవాబు పత్రాలు స్పాట్ కేంద్రానికి చేరుకున్నాయి. ఎలాంటి ఘట నలు చోటుచేసుకోకుండా స్ట్రాంగ్ రూమ్ వద్ద పో లీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. మూ ల్యాంకనం విధులు నిర్వహించే లెక్చరర్లంతా స కాలంలో స్పాట్ కేంద్రానికి చేరుకోవాలని డీఐఈవో జాదవ్ గణేశ్ సూచించారు.
ఇంటిబాట పట్టిన విద్యార్థులు
నేటి నుంచి మూల్యాంకనం
ముగిసిన ఇంటర్ పరీక్షలు