బాసర(ముధోల్): బాసరలోని ఆర్జీయూకేటీలో గురువారం ‘ఇన్‌స్పైర్ అండ్ ఇగ్నైట్’ యూత్ ట్రాన్స్‌ఫర్మేషన్ మిషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ గోవర్ధన్ మాట్లాడుతూ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. కేఎల్‌ఆర్ ఇండస్ట్రీస్ యజమాని కే.లక్ష్మీరెడ్డి మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థులకు పరిశ్రమల సందర్భనకు అవకాశం కల్పిస్తామనడం, శిక్షణ, ఇంటర్న్‌షిప్ కూడా అందిస్తామనడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీధర్షన్, ఏవో శ్రీ రణధీర్ సాగి, అసోసియేట్ డీన్ అకాడమిక్ అండ్ ప్లానింగ్ డాక్టర్ చంద్రశేఖరరావు, అసోసియేట్ డీన్ ఇంజినీరింగ్ డాక్టర్ కె. మహేష్, అసోసియేట్ డీన్ సైన్సెస్ అండ్ హ్యుమానిటీస్ డాక్టర్ విట్టల్, తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి టెక్ ఫెస్ట్ 2025
బాసర: బాసర ఆర్జీయూకేటీలో నేటి నుంచి మూడురోజుల పాటు టెక్‌ఫెస్ట్ 2025 ‘అంతఃప్రజ్ఞ’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎ.గోవర్ధన్ తెలిపారు. గురువారం ఇందుకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ ఇంజనీరింగ్ విభాగాల నుండి విద్యార్థుల వినూత్న ఆలోచనలు, ప్రాజెక్టులు ప్రదర్శిస్తారన్నారు. మానవీయ శాస్త్రాలు, సామాజిక శాస్త్ర విభాగాల నుండి హ్యాకథాన్‌లు, కోడింగ్ పోటీలు రోబోటిక్స్ సవాళ్లు వంటి ఇతర కార్యక్రమాలు కూడా ఉంటాయన్నారు. కార్యక్రమంలో ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీధరన్, ఏవో రణధీర్ సాగి, అసోసియేట్ డీన్స్ డాక్టర్ మహేశ్, డాక్టర్ విట్టల్, ప్రోగ్రామ్ కన్వీనర్ డాక్టర్ ఆర్.అజయ్, స్వప్నిల్, ప్రకాష్, డాక్టర్ రాములు, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.