
ఎకరాకు 15 క్వింటాళ్లు కొనుగోలు చేయాలి
● బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ● తాంసిలో జొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభం
తాంసి: రైతులు యాసంగి సీజన్‌లో పండించిన జొ న్నలను ఎకరానికి 15 క్వింటాళ్ల చొప్పున కొనుగో లు చేయాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నా రు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. కేంద్రం ప్రారంభానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క వస్తున్నారని అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే చివరి నిమిషంలో ఆమె పర్యటన రద్దయింది. రాత్రి 8గంటల తర్వాత ఎమ్మెల్యే కొనుగోళ్లను ప్రారంభించి మాట్లాడారు. జొన్న దిగుబడి పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఎకరానికి కేవలం 8.65క్వింటాళ్లు మాత్ర మే కోనుగోలు చేస్తామడం సరికాదన్నారు. ఇప్పటి కే రుణమాఫీ కాక రైతు భరోసా అందక అన్నదాత ఇబ్బందుల్లో ఉన్నారన్నారు. ఎకరానికి 15 క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలన్నా రు. లేనిపక్షంలో రైతులతో కలిసి ఆందోళనలు చేపడతామన్నారు. ఇందులో పీఏసీఎస్ వైస్‌చైర్మన్ ధ నుంజయ్, సీఈవో కేశవ్, ఏవో రవీందర్, మండల నాయకులు, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు.