
అవగాహన కల్పిస్తున్నాం..
ఈనెల 14న ప్రభుత్వం భూ భారతి పోర్టల్‌ను ప్రారంభించింది. 17 నుంచి 30వరకు ఆ యా మండలాల్లో అవగాహన సదస్సులు కొనసాగనున్నాయి. భూ భారతి ద్వారా భూ సమస్యలు పరిష్కారమవుతాయి. సాదాబైనామా భూములను క్రమబద్ధీకరించుకో వచ్చు. ఇదివరకు ధరణిలో ఈ అవకాశం లేదు. గ్రామ పాలన ఆఫీసర్‌ను నియమించి సమస్యలను పరిష్కరించడానికి చర్యలు చేపడుతున్నాం.– రాజర్షిషా, కలెక్టర్, ఆదిలాబాద్
ధరణి చట్టం శాపంగా మారింది..
గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ధరణి చట్టం రాష్ట్రంలోని అనేక మంది రైతులకు శాపంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ చట్టాన్ని బంగాళాఖాతంలో కలిపేసింది. వాటి స్థానంలో భూ భారతి పోర్టల్‌ను తీసుకొచ్చింది. ధరణి చట్టం ద్వారా దొరల చేతికి మళ్లీ భూములు వెళ్లాయి. పేదలు అనేక ఇబ్బందులకు గురయ్యారు. భూ భారతితో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో భూమి లేకపోయినా గతంలో విచ్చలవిడిగా పట్టాలు జారీ చేశారు. రైతుబంధు కోసమే బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆ విధంగా వ్యవహరించింది. ఏజెన్సీ ప్రాంతంలోని రైతులకు బ్యాంకు రుణాలు ఇచ్చేవిధంగా మంత్రులు చొరవ తీసుకోవాలి.
– వెడ్మ బొజ్జు, ఖానాపూర్ ఎమ్మెల్యే
20 ఏళ్లుగా ఇబ్బందులు..
20 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన భూమికి పట్టా లేకపోవడంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నాం. ధరణి పోర్టల్‌లో పట్టా కాలేదు. సర్వే నం.12లో మా భూమి ఉండగా, అధికారుల చుట్టూ తిరిగి తిరిగి అలిసిపోయాం. భూ భారతిలో మా సమస్య పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాం.
– టాప్రే దత్తు, తరోడా, రైతు, తరోడా

అవగాహన కల్పిస్తున్నాం..

అవగాహన కల్పిస్తున్నాం..