
బాసర ఆలయంలో భక్తుల కిటకిట
బాసర: చదువుల తల్లి సరస్వతి అమ్మవారు కొలువైన బాసర పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలైన్‌లో వేచి ఉన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. శ్రీ సరస్వతి, మహాలక్ష్మి, మహంకాళి అమ్మవార్లకు అభిషేకం, అర్చన పూజలను ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. గోదావరి నదీ తీరం భక్తుల పుణ్యస్నానాలతో రద్దీగా మారింది. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు, పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనానికి 2గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు.

బాసర ఆలయంలో భక్తుల కిటకిట