జేఈఈ మెయిన్స్‌లో ‘జై’ కిసాన్
రంపచోడవరం: జేఈఈ మెయిన్స్ –2025 పరీక్ష ఫలితాల్లో 97 పర్సంటైల్‌తో కింటుకూరి జైకిసాన్ ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. వై.రామవరం మండలం కోట గ్రామానికి చెందిన జైకిసాన్ ఎస్టీ రిజర్వ్‌డ్ విభాగంలో జాతీయ స్థాయిలో రెండవ స్థానంలో నిలిచాడు. మారుమూల ప్రాంతమైన కోట గ్రామం నుంచి జేఈఈ మెయిన్స్ పరీక్షకు హాజరై ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని కలెక్టర్ దినేష్‌కుమార్ అభినందించారు. ఈ సందర్భంగా జైకిసాన్ మాట్లాడుతూ సివిల్స్ సాధించి గిరిజన ప్రాంతంలో ప్రజలకు సేవ చేయాలనేదే తన లక్ష్యమని తెలిపారు. తాను ఐదో తరగతి చదివేటప్పుడు రంపచోడవరం ఐటీడీఏ పీవో పని చేసిన ఇప్పటి కలెక్టర్ దినేష్‌కుమార్ గిరిజనులకు ఎంతో సేవ చేశారని, ఆయనే తనకు ఆదర్శమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment