గడువులోగా రీ సర్వే పూర్తి
డుంబ్రిగుడ: గడువులోగా రీ సర్వే పూర్తి చేయాలని పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి, జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎం.జె.అభిషేక్ గౌడ ఆదేశించారు. ఆయన సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి, రీ సర్వే ఆన్‌లైన్ పోర్టల్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రీ సర్వే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. తమకు న్యాయం చేయాలని ఏకలవ్య పాఠశాల నిర్మాణాలకు భూములిచ్చిన భూ దాతలు జాయింట్ కలెక్టర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. సబ్‌కలెక్టర్ సానుకూలంగా స్పందించారని, సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారని భూదాతలు గొల్లోరి డొంబు, రామ్‌చందర్, రాందాసు తెలిపారు. ఈకార్యక్రమంలో ఇన్‌చార్జ్ తహసీల్దార్ ముజీబ్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment