డ్రాయింగ్ టీచర్‌కుజాతీయస్థాయి పురస్కారం
రాజవొమ్మంగి: స్థానిక అల్లూరి సీతారామరాజు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో డ్రాయింగ్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మిరియాల కొండబాబు జాతీయస్థాయిలో మెరిట్ అవార్డు పొందారు. గుంటూరులోని శ్రీవేంకటేశ్వర విజ్ఞాన మందిర్‌లో జరిగిన కార్యక్రమంలో నిర్వాహకులు కొండబాబుకు అవార్డు అందజేసి, దుశ్శాలువాతో సత్కరించారు. ఇటీవల గుంటూరులో క్రియేటివ్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో చిత్రకారులకు నిర్వహించిన ఇండియన్ ఆర్ట్ ఫెస్టివల్‌లో ప్రతిభ చూపిన కొండబాబుకు ఈ పురస్కారం లభించినట్టు పాఠశాల హెచ్‌ఎం గోపాలకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన అభినందన సభలో తాను చిత్రీకరించిన పలు తైలవర్ణ చిత్రాలను కొండబాబు ప్రదర్శించారు. తోటి ఉపాధ్యాయులు కొండబాబును అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment