విద్యార్థుల స్థాయికి అనుగుణంగా బోధన చేయాలి
● డీఈవో బ్రహ్మాజీరావు
ముంచంగిపుట్టు: విద్యార్థుల స్థాయికి అనుగుణంగా ఉపాధ్యాయులు విద్యాబోధన చేయా లని డీఈవో పి.బ్రహ్మాజీరావు తెలిపారు. కిలగాడలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.పాఠశాల రికార్డులు, తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులకు పలు ప్రశ్నాలు వేసి జవాబులు రాబట్టారు. పాఠ్యపుస్తకాల ను చదివించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తరచూ సెలవులు పెడుతున్న హెచ్‌ఎం నీలకంఠం స్థానంలో నూతనంగా భాస్కరరావును హెచ్‌ఎంగా నియమించినట్టు చెప్పారు. ముఖ్యంగా చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అనంతరం ముంచంగిపుట్టులోని శారద నికేతన్ ఇంగ్లిషు మీడియం ప్రైవేట్ స్కూల్‌ను తనిఖీ చేశారు. పాఠశాలలో బోధిస్తున్న ఉపాధ్యాయుల విద్యార్హతలు,ఫీజుల వివరాలను ప్రిన్సిపాల్ మత్స్యరాజును అడిగి తెలుసుకున్నారు.అన్ని రకాల సౌకర్యాలతో పాఠశాల నిర్వహణ జరగాలని డీఈవో సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment