రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తల దుర్మరణం
ఎటపాక: స్థానిక నవోదయ పాఠశాల సమీపంలో జామాయిల్ కర్రల లోడు ట్రాక్టర్ ఢీకొని భార్యాభర్తలు దుర్మరణం చెందారు. సీఐ కన్నపరాజు తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని మారాయిగూడెం పంచాయతీ భీమవరం గ్రామానికి చెందిన సోయం రాంబాబు(45),ముత్యాలమ్మ(40) ద్విచక్రవాహనంపై భద్రాచలం వచ్చారు. పని ముగించుకుని ఆదివారం రాత్రి ఎటపాక మండలం బొజ్జిగుప్ప గ్రామం మీదుగా స్వ గ్రామానికి తిరిగి ప్రయాణమయ్యారు. ఈసమయంలో ఎదురుగా జామాయిల్ కర్ర లోడుతో ట్రాక్టర్ భద్రాచలం వస్తోంది. సింగిల్‌రోడ్డు కావడంతో వారు నవోదయ పాఠశాల సమీపంలో ట్రాక్టర్‌ను దాటి వెళ్లేక్రమంలో ట్రాక్టర్‌లో ఉన్న కర్ర ద్విచక్రవాహనానికి తగలడంతో ఈప్రమాదం జరిగింది. భార్యాభర్తలిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డుపై పడిపోయిన వీరిని 108 వాహనంలో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వివాహానికి వెళ్లి వస్తూ బాలుడు మృతి
జి.మాడుగుల: మండలంలోని నుర్మతి రోడ్డులో ఆదివారం జరిగిన ప్రమాదంలో విశాఖ జిల్లా పెందుర్తికి చెందని ఓ బాలుడు మృతిచెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. జి.మాడుగుల మండలం నుర్మతి పంచాయతీ అనర్భ గ్రామంలో జరిగిన వివాహానికి పెందుర్తి నుంచి కర్రి సాయి చరణ్(17) అనే బాలుడు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో ద్విచక్రవాహనం మీద వస్తుండగా గుదలం వీధి వద్ద బైక్ అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యాడు. కిందపడిన సాయి చరణ్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు.ఈ ప్రమాదంపై పోలీసులకు ఫిర్యాదు అందాల్సి ఉంది.
ద్విచక్రవాహనంపై వెళుతుండగా ఘటన
మృతులు తెలంగాణ వాసులు
రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తల దుర్మరణం
రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తల దుర్మరణం
రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తల దుర్మరణం
రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తల దుర్మరణం
Comments
Please login to add a commentAdd a comment