తరగతుల తరలింపును విరమించుకోవాలి
హుకుంపేట: తమ గ్రామ పాఠశాల నుంచి 3,4,5 తరగతుల తరలింపు నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ మండలంలోని కోడెలి గ్రామస్తులు శనివారం ఆందోళన చేశారు. జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) బి.లవరాజు గ్రామాన్ని సందర్శించిన సందర్భంగా కోడెలి గ్రామస్తులు, వలంటీర్ల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బర్లు కొండబాబు నిరసన వ్యక్తం చేశారు. తమ గ్రామంలో విద్యార్థులు తక్కువగా ఉన్నారన్న సాకుతో 3,4,5 తరగతులను వేరే పాఠశాలకు తరలించి, క్రమంగా గ్రామంలో పాఠశాలను మూసివేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రపన్నుతోందని వారు ఆరోపించారు. తరగతుల తరలింపు నిర్ణయాన్ని విరమించుకోవాలని కోరుతూ డీపీవోకు వినతి పత్రం అందజేశారు. అనంతరం పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ తరగతులను తరలిస్తే సహించేది లేదని, కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని తెలిపారు. డీపీవో వెంట ఎంఈవోలు చెల్లయ్య,ఈశ్వరరావు,ఈవోపీఆర్డీ అప్పలరాజు తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment