జిల్లాలో ఏటా వేసవిలో అగ్నిప్రమాదాలు అధికంగా సంభవిస్తూ అ
కష్టం కళ్లముందే బుగ్గిపాలు
మూడేళ్ల క్రితం ఖరీఫ్‌లో సాగు చేసిన వరిపంట మొత్తం కళ్లముందే దగ్ధమైంది.ఆరుగాలం కష్టం చూస్తుండగానే కాలిపో తున్నా ఏంచేయలేకపో యాం. పాడేరు అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ చేసినా ఫలితంలేకపోయింది.అరకులోయలో అగ్నిమాపక కేంద్రం లేకపోవడంతో ఈప్రాంతంలో అగ్నిప్రమాదాలు జరిగితే తీవ్రంగా నష్టపోవలసి వస్తోంది. – సొనాయి బజ్జింగు, బోసుబెడ గ్రామం
సాక్షి, పాడేరు: ప్రస్తుత వేసవిలో ఏ చిన్న అగ్ని ప్రమాదం సంభవించినా పెనుముప్పుగా మారే అవకాశం ఉంది. లక్షల రూపాయల ఆస్తులు, విలువైన ప్రాణాలు బుగ్గిపాలు కావాల్సిందే. ముదురుతున్న ఎండలతో అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటే నివారించడం సవాల్‌గా మారుతుంది. పాడేరు, రంపచోడవరం, కూనవరం అగ్నిమాపక కేంద్రాలే పాడేరు, అరకులోయ, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 22 మండలాల్లో సేవలందిస్తున్నాయి. గత 20 ఏళ్లుగా అరకులోయ,చింతపల్లి మండలాల్లో అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటు ప్రతిపాదనలకే పరిమితమైంది.పాడేరు డివిజన్‌లోని 11మండలాలకు పాడేరులోని అగ్నిమాపక కేంద్రం ఒక్కటే ఆధారం. పాడేరు నుంచి అనంతగిరి, ముంచంగిపుట్టు, జీకే వీఽధి,కొయ్యూరు మండలాలు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అగ్ని ప్రమాదాలు జరిగితే పాడేరు నుంచి ఆయా ప్రాంతాలకు అగ్నిమాపక శకటం సకాలంలో వెళ్లలేకపోవడంతో నష్టం విపరీతంగా జరుగుతోంది.
రెండు వాహనాల్లో ఒకటి మూలకు..
పాడేరు అగ్నిమాపక కేంద్రం సేవలను విస్తరించడంలో ఆశాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పడిన తరువాత కూడా జిల్లాలో అగ్నిమాపక కేంద్రాల విస్తరణ లేకపోవడం దారుణమని అన్ని వర్గాల ప్రజలు వాపోతున్నారు. పాడేరులో అదనంగా మరో వాహనం ఏర్పాటు చేసినప్పటికీ అది మరమ్మతులతో మూలకు చేరింది.
● పాడేరుకు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న సీలేరు పవర్ ప్రాజెక్ట్‌లో, సుమారు 85 కిలోమీటర్ల దూరంలోని మాచ్‌ఖండ్ పవర్ ప్రాజెక్టులో అగ్నిప్రమాదాలు జరిగితే పాడేరు నుంచే అగ్నిమాపక వాహనం వెళ్లాలి. ఈ రెండు ప్రాజెక్టులకు వాహనం వెళ్లాలంటే కనీసం నాలుగు గంటల సమయం పడుతుంది. ఈ ప్రాజెక్టులలో అగ్ని ప్రమాదాలు జరిగితే పరిస్థితి దైవాదీనమే. నాలుగేళ్ల క్రితం మాచ్‌ఖండ్‌లో విద్యుత్ తయారీ జనరేటర్ విభాగంలో మంటలు వ్యాపించినప్పుడు వాటిని అదుపు చేసేందుకు అధికారులు అష్టకష్టాలు పడ్డారు.పాడేరు నుంచి అగ్నిమాపక శకటం వెళ్లేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దూర ప్రాంతాలలో అగ్ని ప్రమాదాలు జరుగుతున్న సమయంలో సకాలంలో వాహనం చేరుకోలేకపోతోంది. దీంతో ప్రజల, ప్రభుత్వ ఆస్తులు బుగ్గిపాలవుతున్నాయి.
ప్రతిపాదనలతో సరి..
అరకులోయ, చింతపల్లిలలో రెండు అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటు చేస్తే అరకులోయ, డుంబ్రిగుడ, అనంతగిరి, ముంచంగిపుట్టు, చింతపల్లి, జి.కె.వీఽధి, కొయ్యూరు మండలాల్లో ప్రమాదాలు జరిగితే సకాలంలో మంటలను అదుపు చేసి, ప్రజల ఆస్తులు, ప్రాణాలను రక్షించే అవకాశం ఉంటుంది. ఆ రెండు చోట్ల అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలున్నప్పటికీ అవి కాగితాలకే పరిమితమయ్యాయి.
పాడేరులోని అగ్నిమాపక కేంద్రం
22 మండలాలకు
మూడే అగ్నిమాపక కేంద్రాలు
సకాలంలో మంటలార్పక
బూడిదవుతున్న ఆస్తులు
మాచ్‌ఖండ్, సీలేరు పవర్ ప్రాజెక్టులకు పాడేరు నుంచే వాహనం వెళ్లాలి
100 నుంచి 140 కిలోమీటర్ల దూరం ప్రయాణం
చింతపల్లి, అరకులోయలలో కేంద్రాల ఏర్పాటు ప్రతిపాదనలకే పరిమితం
అగ్నిమాపక కేంద్రాలఏర్పాటుకు చర్యలు
జిల్లాలో అవసరమైన చోట్ల అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటు చర్యలు తీసుకుంటాం. అరకులోయకు అగ్నిమాపక కేంద్రం మంజూరైంది.స్థఽలపరిశీలన జరుపుతున్నాం. చింతూరులోను అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉంది.
– లక్ష్మణ స్వామి,
జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి
పాడేరు నుంచి వాహనం రావడం కష్టమే
జీకే వీధి మండలంలోని సీలేరు.. పాడేరుకు 140 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటే పాడేరు నుంచి వాహనం రావడానికి కనీసం ఐదు గంటల సమయం పడుతుంది. చింతపల్లిలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలి
– ధనుంజయకుమార్, వ్యాపారి, సీలేరు
2020–25 సంవత్సరాల మధ్యలో జరిగిన అగ్నిప్రమాదాల వివరాలు
కూనవరం ఔట్‌పోస్ట్ ఫైర్‌స్టేషన్
సంవత్సరం ప్రమాదాల నష్టం వివరాలు రక్షించిన ఆస్తి విలువ
సంఖ్య రూ.లక్షలలో రూ.లక్షలలో
2020–21 30 16,45,000 58,10,000
2021–22 27 17,30,000 34,70,000
2022–23 33 18,42.000 37,65,000
2023–24 28 28,73,500 35,17,500
2024–25 44 19,52,000 81,02,000
రంపచోడవరం
2021–22 43 35,83,500 16,13,500
2022–23 25 16,35,000 27,10.000
2023–24 22 12,11,000 13,84,000
2024–25 21 8,43,000 26,12,000
కూనవరంలో నలుగురే...
కూనవరం: కూనవరం అగ్నిమాపక కేంద్రం పరిధిలో కూనవరంతో పాటు వీఆర్‌పురం, చింతూరు, ఎకటపాక మండలాలున్నాయి. ఈ కేంద్రంలో తొమ్మిది మంది సిబ్బందిగాను కేవలం నలుగురు మాత్ర మే ఉన్నారు. ఔట్‌పోస్టు ఫైర్ స్టేషన్‌గా దీనిని ఏర్పాటు చేయడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రతి 15 రోజులకు నలుగురు చొప్పున డిప్యుటేషన్‌పై వచ్చి విధులు నిర్వహిస్తారు. శాశ్వత సిబ్బంది కాకపోవడంతో ఈ ప్రాంతంపై కొంత అవగాహన తక్కువగా ఉంటోంది. రంపచోడవరం అగ్నిమాపక కేంద్రంలో ఒక ఎస్‌ఎఫ్‌వో, లీడింగ్ ఫైర్ సిబ్బంది ముగ్గురు, డ్రైవర్ ఆపరేటర్లు ముగ్గురు, హోంగార్డులు ఇద్దరు ఉన్నారు. ఈకేంద్రం పరిధిలో రంపచోడవరం మండలంతో పాటు మారేడుమిల్లి, అడ్డతీగల, వై.రామవరం, రాజవొమ్మంగి, దేవీ పట్నం,గంగవరం మండలాలున్నాయి.
జిల్లాలో ఏటా వేసవిలో అగ్నిప్రమాదాలు అధికంగా సంభవిస్తూ అ
జిల్లాలో ఏటా వేసవిలో అగ్నిప్రమాదాలు అధికంగా సంభవిస్తూ అ
జిల్లాలో ఏటా వేసవిలో అగ్నిప్రమాదాలు అధికంగా సంభవిస్తూ అ
Comments
Please login to add a commentAdd a comment