ఇంటర్ స్టేట్ క్రికెట్ టోర్నీ ప్రారంభం
మోగుతూడెం: చింతూరు మండలం మోతుగూడెంలో ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు గ్రామాలకు చెందిన 42 టీములతో నిర్వహిస్తున్న ఇంటర్ స్టేట్ క్రికెట్ టోర్నమెంట్‌ను చింతూరు ఏఎస్పీ పంకజ్ కుమార్ మీనా, ఏపీ జెన్‌కో చీఫ్ ఇంజినీర్ వాసుదేవరావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ స్థానిక యువత చదువుతోపాటు క్రీడలపై దృష్టి సారించాలన్నారు.దూరం నుంచి వచ్చే క్రీడాకారులకు భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు టోర్నీ నిర్వాహకుడు మోతుగూడెం గ్రామానికి చెందిన దూల్లూరి గోపి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ జెన్‌కో ఎస్‌ఈ(ఓ అండ్ ఎం) చిన్న కామేశ్వరరావు, డీఈలు బాలకృష్ణ, వరప్రసాద్, ఎస్‌ఐ శివన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment