కొయ్యూరు: మండలంలోని ఐదు పాఠశాలల్లో శనివారం తనిఖీలు నిర్వహించారు. విజయనగరం జిల్లాకు చెందిన ఉపాధిహామీ పథకం అధికారి కొయ్యూరు మండలంలో ప్రభుత్వోన్నత పాఠశాల, బాలుర ఆశ్రమ పాఠశాల–1,కస్తూర్బాగాంధీ పాఠశాల, బాలారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, శరభన్నపాలెం పంచాయతీ శరమండ ప్రాథమిక పాఠశాలలో తనిఖీలు నిర్వహించారు. విద్యార్థుల హాజరు సరిచూశారు. వసతి గృహాలకు సంబంధించి నిల్వలను పరిశీలించారు.రికార్డుల్లో చూపిన దానికి భౌతికంగా ఉన్న నిల్వలను సరి చూశారు. కిలో బియ్యం ఎక్కువైతే ఆ బియ్యం ఎలా మిగిలాయని ప్రశ్నించడంతో ఉపాధ్యాయులు పూర్తి వివరణ ఇచ్చారు. మరో శాఖద్వారా ఇలాంటి తనిఖీలు నిర్వహించడం ఇదే మొదటి సారి కావడంతో ఉపాధ్యాయులు ఆందోళనకు గురయ్యారు. దీనిపై ఎంఈవో రాంబాబు మాట్లాడుతూ ఐదు పాఠశాలల్లో సామాజిక తనిఖీలు నిర్వహించినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment