చింతపల్లి ఏకలవ్య పాఠశాలను సందర్శించిన సంక్షేమ శాఖ డీడీ
చింతపల్లి: ఏకలవ్య వంటి ప్రతిష్టాత్మక కేంద్రీయ విద్యాలయాల్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండి విద్యార్థులు చక్కగా చదువుకునేందుకు అనుకూలంగా ఉండాలని, పాఠశాల యాజమాన్యాలు ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పాడేరు గిరిజన సంక్షేమశాఖ డీడీ రజని అన్నారు. ఇటీవల చింతపల్లి ఏకలవ్య పాఠశాలలో విద్యార్థుల మధ్య వివాదాలు, బాలికలను ఏడిపిస్తున్నారని వచ్చిన ఫిర్యాదులతో విద్యార్థులను ఉపాధ్యాయులు దండించడం, ఈ వ్యవహారంపై తల్లిదండ్రులు ఆందోళనలకు సిద్ధపడటం వంటి సంఘటనల నేపథ్యంలో ఇప్పటికే పలువురు అధికారులు విచారణ చేపట్టారు. తాజాగా ఏకలవ్య పాఠశాలను డీడీ రజని సందర్శించి అక్కడ బాలబాలికలతో వేరువేరుగా మాట్లాడారు. పాఠశాల ఉపాధ్యాయులతోనూ మాట్లాడారు. పాఠశాలలో వివాదాలు లేకుండా చక్కగా చదువులు సాగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఆమె వెంట ఏటీడబ్ల్యూవో జయనాగలక్ష్మి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment