3,4,5 తరగతుల విలీనం తగదు
డుంబ్రిగుడ: జిల్లాలోని పలుగ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలల్లో గల 3,4,5 తరగతులను ఆశ్రమ పాఠశాలల్లో విలీనం చేసేందుకు చర్యలు తీసుకోవడం తగదని గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు టి.సూర్యనారాయణ అన్నారు. మండలంలోని గుంటసీమ పంచాయతీ సరియావలసలో ఆయన విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. తరగతులను విలీనం చేయవద్దని డిమాండ్ చేస్తూ పాఠశాల వద్ద ఆందోళన చేశారు. అనంతరం సూర్య నారాయణ మాట్లాడుతూ 3,4,5 తరగతులను విలీనం చేస్తే జిల్లాలో పలు ప్రాథమిక పాఠశాలు మూతబడి,డ్రాప్‌అవుట్లు పెరుగుతాయని, దీంతో గిరిజన విద్యార్థులు విద్యకు దూరమవుతారని చెప్పారు. ఈవిషయమై విద్యాశాఖ అధికారులతో పాటు కలెక్టర్ స్పందించి విలీనం ఆదేశాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విద్యా కమిటీ చైర్మన్ కె.రాందాస్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు
సూర్యనారాయణ
Comments
Please login to add a commentAdd a comment