ఐఐఎంఆర్‌ శిక్షణకు మత్స్యదేవత ఎఫ్‌పీవో రైతులు | - | Sakshi
Sakshi News home page

ఐఐఎంఆర్‌ శిక్షణకు మత్స్యదేవత ఎఫ్‌పీవో రైతులు

Published Mon, Mar 3 2025 12:48 AM | Last Updated on Mon, Mar 3 2025 12:45 AM

ఐఐఎంఆర్‌ శిక్షణకు మత్స్యదేవత ఎఫ్‌పీవో రైతులు

ఐఐఎంఆర్‌ శిక్షణకు మత్స్యదేవత ఎఫ్‌పీవో రైతులు

జి.మాడుగుల: భారతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థ (ఐఐఎంఆర్‌) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఫ్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాల యం ఆడిటోరియంలో ఈ నెల 3,4 తేదీల్లో రెండు రోజుల పాటు గిరిజన రైతులకు చిరుధాన్యాల సాగు, వాటి ఉత్పత్తులపై శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణకు స్థానిక మత్స్యదేవత ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్స్‌ ఆర్గనైజేషన్‌(ఎఫ్‌పీవో)కు చెందిన 40 మంది గిరిజన రైతులు ప్రత్యేక బస్సులో ఆదివారం బయలుదేరారు. ఈ మేళాలో శాసీ్త్రయ సాగు, జీవవైవిధ్య పరిరక్షణ, పోషకాహార విలువలతో కూడిన చిరుధాన్యా ల ఉత్పత్తులు, ప్రాసెసింగ్‌, మార్కెటింగ్‌ తదితర ఆంశాలపై అవగాహన కల్పించనున్నట్టు మత్స్యదేవత ఎఫ్‌పీవో సీఈవో ఐసరం హనుమంతరావు తెలిపారు. ఐఐఎంఆర్‌ ప్రమోట్‌ చేసిన ఆంధ్రప్రదేశ్‌ రైతు ఉత్పత్తిదారుల సంఘాలతో పాటు జి.మాడుగుల మత్స్యదేవత ఎఫ్‌పీవో పాల్గొనడమేకాకుండా స్టాల్‌ను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఈ మేళలో ఆంధ్రప్రదేశ్‌,తెలంగాణ,కర్ణాటక,తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలకు చెందిన రైతులు హాజరవుతారని ఆయన తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement