20 ఎకరాల్లో కాఫీ, మిరియాల తోటలు దగ్ధం
ముంచంగిపుట్టు: మండలంలోని దార్రెల పంచాయతీ తలింభ గ్రామ సమీపంలో 18 మంది రైతులకు చెందిన 20ఎకరాల్లోని కాఫీ, మిరియాల తోటలు ఆదివారం దగ్ధమయ్యాయి. దీంతో గిరిజన రైతులు తీవ్రంగా నష్టపోయారు. తలింభ గ్రామానికి చెందిన బాధిత గిరిజన రైతులు దామోదరం, అర్జున్, రఘునాథ్, జగన్నాథం, బలరాంలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామ సమీపంలోని కొండ ప్రాంతం నుంచి భారీగా మంటలు వస్తుండడంతో వెళ్లి చూడగా కాఫీ, మిరియాల తోటలు కాలిపోతూ కనిపించాయని, మంటలను ఆర్పేందుకు యత్నించినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. పంట చేతికి వచ్చే సమయంలో 14వేల కాఫీ మొక్కలు, నాలుగు వేల మిరియాల పాదులు ఆగ్నికి ఆహుతి అయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆకతాయిలు చేసిన పని వల్ల రూ.3 లక్షల వరకు నష్టం జరిగిందని తెలిపారు. వీటిపైనే ఆధారపడి జీవించే మా కుటుంబాలు రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని, కలెక్టర్ స్పందించి, తమను ఆదుకోవాలని వారు కోరారు. సర్పంచ్ పాండురంగస్వామి, పీసా కమిటీ కార్యదర్శి సాధూరాం, వీఆర్‌వో అజయ్‌పడాల్, వీఆర్‌ఏ లోహితాస్ తదితరులు... దగ్ధమైన కాఫీ, మిరియాలు తోటలను పరిశీలించారు. బాధిత రైతులను ఆదుకోవాలని వారు కోరారు.
నిప్పు పెట్టిన ఆకతాయిలు
తీవ్రంగా నష్ట పోయిన గిరిజన రైతులు
Comments
Please login to add a commentAdd a comment