వన్యప్రాణులపైపోస్టర్ ప్రదర్శన పోటీలు
ఆరిలోవ(విశాఖ): ఇందిరాగాంధీ జూ పార్కులో ఆదివారం ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జూ అధికారులు విద్యార్థులకు అవగాహన కోసం ఒకటో తరగతి నుంచి పీజీ వరకు వన్యప్రాణులపై పోస్టర్ ప్రదర్శన పోటీలు నిర్వహించారు. వారికి కేటగిరీల వారిగా అప్పగించిన అంశాలపై ఇంటి వద్దే పోస్టర్లు సిద్ధం చేసుకొని జూ బయోస్కోప్‌లో జరిగిన పోటీలకు హాజరయ్యారు. విశాఖ నగరంలోని పలు పాఠశాలలు, కళాశాలల నుంచి సుమారు 150 మంది విద్యార్థులు పాల్గొని వారి ప్రతిభ చూపారు. పోస్టర్లను తోటి విద్యార్థులు, అతిథులు, జూ సందర్శకులు ఆసక్తిగా తిలకించారు. ఉత్తమ పోస్టర్లు ప్రదర్శించిన విద్యార్థులకు ముఖ్య అతిథి ఏయూ జంతు శాస్త్ర విభాగం అధ్యాపకురాలు డాక్టర్ సి.మంజులత, జూ క్యూరేటర్ బహుమతులు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో జూ అసిస్టెంట్ క్యూరేటర్లు గోపి, గోపాలరావు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment