సమస్యలతో సతమతం
కొయ్యూరు: ఎందరు అధికారులు మారినా రేవళ్లుకు పాఠశాల యోగ్యం కలగడం లేదు. గత్యంతరం లేక స్థానిక విద్యార్థులు కొయ్యూరు, రాజేంద్రపాలెం వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. రేవళ్లు పేరిట పాఠశాల ఏర్పాటు చేయాలని స్థానికులు పలుమార్లు అధికారులకు వినతులు ఇచ్చినా పట్టించుకోలేదు. రేవళ్లులో ప్రస్తుతం కొనసాగుతున్న పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులున్నారు. ఈ పాఠశాల భవనం అధ్వానంగా ఉందని, మరమ్మతు చేయించాలని స్థానికులు కోరుతున్నారు. ఏళ్ల తరబడి సమస్య ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు. పాఠశాలకు ప్రహరీ లేదని, మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయంటున్నారు. ఇద్దరు ఉపాధ్యాయులు, సుమారు 35 చిన్నారులతో కొనసాగుతున్న పాఠశాలను ఎత్తివేయడం దారణమంటున్నారు. గత్యంతరం లేక తమ పిల్లలను రాజేంద్రపాలెం, కొయ్యూరు ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేవళ్ల పాఠశాల సమస్యపై ఎంపీపీ బడుగు రమేష్ మాట్లాడుతు సమస్యను కలెక్టర్ దినేష్‌కుమార్ దృష్టిలో ఉంచామన్నారు. ఆయన స్పందించినట్టు చెప్పారు. ఈ విషయంపై ఎంఈవో ఎం.రాంబాబు మాట్లాడుతూ రేవళ్ల పాఠశాల సమస్యను ఉన్నతాధికారులకు తెలియజేశామన్నారు. పాఠశాలకు డైస్ కోడ్ అవకాశం ఉందని, దీంతో రేవళ్లలోనే స్కూల్ కొనసాగే అవకాశముంటుందన్నారు.
రేవళ్లులో మూడబడిన పాఠశాల
కొయ్యూరు, రాజేంద్రపాలెం వెళ్తున్న విద్యార్థులు
సమస్యలతో సతమతం
Comments
Please login to add a commentAdd a comment