● రంపచోడవరం ఐటీడీఏ పీవో
కట్టా సింహాచలం
రంపచోడవరం: ఇంజినీరింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం ఆదేశించారు. ఐటీడీఏ సమావేశం హాల్‌లో శుక్రవారం వివిధ ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పీవో మాట్లాడుతూ వచ్చే వర్ష కాలం నాటికి పనులు పూర్తి చేయాలన్నారు. గిరిజన సంక్షేమ, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, గృహనిర్మాణ శాఖ ద్వారా ప్రారంభించిన పనుల ప్రగతిపై సమీక్షించారు. ఏజెన్సీలో ఏకలవ్య మోడల్ స్కూల్స్, పాఠశాల భవనాలు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. భవనాల నిర్మాణ కోసం ఇసుక, ఇతర సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. సమావేశంలో ఈఈలు ఐ.శ్రీనివాసరావు,రవికుమార్, సుబ్బయ్య, డీఈలు పి.వెంకటరమణ, చైతన్య,నాగరాజు, గౌతమి, శివ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment