రంపచోడవరం: వైఎస్సార్‌సీపీ రంపచోడవరం నియోజవకర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులను నియమించారు. పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగింది. రంపచోడవరం నియోజకవర్గం యూత్ వింగ్ అధ్యక్షుడిగా కొమలి రాజేంద్రప్రసాద్, మహిళ విభాగం అధ్యక్షురాలిగా దామెర్ల రేవతి(ఎటపాక మండలం), క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా పీటర్ సింగయ్య (ఎటపాక మండలం), వైఎస్సార్ ట్రెడ్ యూనియన్ అధ్యక్షుడిగా మర్మం శంకర్(ఎటపాక మండలం)ను నియమించారు. మైనార్టీసెల్ అధ్యక్షుడిగా షేక్ కాజావల్లీ(అడ్డతీగల మండలం), బూత్ కమిటీ వింగ్ అధ్యక్షుడు తోట రాజేశ్వరరావు(అడ్డతీగల మండలం)ను నియమించారు. రాజవొమ్మంగి మండలానికి చెందిన కనిగిరి దుర్గప్రసాద్‌ను పంచాయతీ రాజ్ వింగ్ అధ్యక్షుడిగా, వీఆర్ పురం మండలానికి చెందిన ముత్యాల గౌతమ్ ప్రభాకర్‌ను ఐటీ వింగ్ అధ్యక్షుడిగా, గంగవరం మండలానికి చెందిన తాతపూడి ప్రకాష్‌ను ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా, సీహెచ్ దుర్గారాఘునాఽఽథ్‌ను సోషల్ మీడియా వింగ్ అధ్యక్షుడిగా నియమించారు. రంపచోడవరం మండలానికి చెందిన అన్నపరెడ్డి రవిరామ్ భగవాన్‌ను లీగల్ సెల్ అధ్యక్షుడిగా, పండా రామకృష్ణను ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా నియమించారు.యూత్ వింగ్ అధ్యక్షుడిగా కొమలి రాజేంద్రప్రసాద్, రైతు విభాగం అధ్యక్షుడిగా నోముల కొండలరావు, బీసీ సెల్ అధ్యక్షుడిగా బొడ్డేటి గంగరాజు, స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడిగా అడపా నాగసాయి,ఆర్టీసీ వింగ్‌కు గొర్లె అనిల్ ప్రసాద్, వలంటీర్ల వింగ్‌కు రొలుపల్లి ఆనంద్‌బాబు,గ్రీవెన్స్ సెల్‌కు ముత్యాల మురళీ, వాణిజ్య విభాగానికి కొత్త రమేష్, అంగన్‌వాడీ వింగ్‌కు కంచం సత్యవతి, పబ్లిసిటీ వింగ్‌కు కొమలి సీతారామప్రసాద్‌లను నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment