సంతలో గుట్కాలు, ప్లాస్టిక్ కవర్ల స్వాధీనం
ముంచంగిపుట్టు: మండల కేంద్రం ముంచంగిపుట్టులో శనివారం వారపు సంతలో నిషేధిత గుట్కాలు, ప్లాస్టిక్ కవర్లను ఒడిశా వ్యాపారుల నుంచి జిల్లా విజిలెన్స్ మెంబర్ ప్రసన్నకుమార్, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ స్వాధీనం చేసుకున్నారు. వారపు సంతలో గుట్కాలు, ప్లాస్టిక్ కవర్లు అమ్ముతున్నారని సమాచారం రావడంతో సంతలో తనిఖీలు నిర్వహించారు. మళ్లీ గుట్కాలు, ప్లాస్టిక్ కవర్లు అమ్మినట్టు తెలిస్తే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి, విడిచిపెట్టారు. స్వాధీనం చేసుకున్న గుట్కాలు, ప్లాస్టిక్ కవర్లను పంచాయితీ అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబరు ప్రసన్నకుమార్ మాట్లాడుతూ నిషేధిత గుట్కాలు, ప్లాస్టిక్ కవర్లు ఒడిశా నుంచి ఆంధ్రలోని వారపు సంతలకు తీసుకువచ్చి అమ్మకాలు చేస్తున్నారని చెప్పారు. ఇలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment