మన్యం కొండ జాతరకు ఏర్పాట్లు పూర్తి
మోతుగూడెం: చింతూరు మండలం పొల్లూరలో ఈ నెల 3న జరిగే మన్యం కొండ జాతరకు ఏర్పాట్లు పూర్తికావచ్చాయి. వనదేవతలను దాటించేందు సీలేరు నదిపై ఫ్లోటింగ్ బ్రిడ్జిని నిర్మించారు. ఈ జాతరకు 40వేల మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సీలేరు నదిపై, వనదేవతలకు స్నానం చేయించే పొల్లూరు వాటర్ ఫాల్స్ వద్ద బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి ఐటీడీఏ పీవో దుర్యోధన బోయ్ , మల్కన్‌గిరి,కలిమెల తహసీల్దార్లు మన రాష్ట్రంలో శనివారం పర్యటించి, ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆంధ్రా నుంచి స్థానిక ఎస్‌ఐ శివన్నారాయణ, పంచాయతీ కార్యదర్శి సెక్రటరీ మోహన్, ఏపీ జెన్‌కో అధికారులు జాతర ఏర్పాట్లు ముమ్మరంగా పనులు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment