యాగంలో వైభవంగా మహాపూర్ణాహుతి
ఎటపాక: ఉష్ణగుండాల వద్ద జరుగుతున్న 23వ శ్రీఅష్టలక్ష్మి యాగంలో శనివారం మహా పూర్ణాహుతి కార్యక్రమం వైభవంగా జరిగింది. ముందుగా శుక్రవారం రాత్రి శ్రీలక్ష్మీనారాయణ కల్యాణం కనుల పండువగా సాగింది. ఇష్టి, పూర్ణాహుతి కార్యక్రమంలో అష్టాక్షరి, బృందావనం జీయర్ స్వాములు పాల్గొని ప్రవచనాలు చేశారు. శ్రీపీతాంబరం రఘునాథాచార్యస్వామి ఆధ్వర్యంలో జరిగిన దీపోత్సవం పూజల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి రామాలయం స్థానాచార్య స్థల సాయి, వేద పండితులు మురళీకృష్ణమాచార్యులు యాగ నిర్వాహక కమిటీ, అష్టలక్ష్మి వైభవ దీపిక సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment