నాతవరం : భర్త మందలించాడన్న కారణంతో భార్య కిరోసిన్ పెట్రోల్ కలిపి పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలో నెలకొంది. నర్సీపట్నం రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ అందించిన వివరాల మేరకు మండలంలో ఎం.బి.పట్నం గ్రామానికి చెందిన పల్లి వెంకటలక్ష్మి (30) మంగళవారం ఉదయం తన కుమార్తె అల్లరి చేయడంతో కొట్టింది, అప్పటికే జ్వరంతో ఉన్న కుమార్తెను ఎందుకు కొట్టావంటూ భర్త పల్లి గోవింద్ భార్య వెంకటలక్ష్మి తీవ్రంగా మందలించడమే కాకుండా చెయ్యి చేసుకున్నాడు. దీంతో ఇరువురూ ఇంటి వద్ద ఘర్షణ పడ్డారు. కొంత సేపటి తర్వాత గోవింద్ తన జీడిమామిడి తోటలో పిక్కలు సేకరించడం కోసం వెళ్లిపోయాడు. జ్వరంతో ఉన్న పాపకు మధ్యాహ్నం వెంకటలక్ష్మి భోజనం పెట్టి ఇంటి వద్దే ఉంది. భర్త మండలించాడన్న కోపంతో వెంకటలక్ష్మి వ్యవసాయ ఇంజిన్ మోటారులో వేసేందుకు తీసుకువచ్చి ఇంట్లో ఉంచిన కిరోసిన్, పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్మ చేసుకుంది. కుమార్తె ఇంట్లో జ్వరంతో పడుకోని ఉండడంతో ఇంటి వెనుకకు వెళ్లి ఆత్మహత్య చేసుకుంది, మృతురాలికి బాబు, పాప ఉన్నారు. వెంకటలక్ష్మి, గోవింద్‌కు 15ఏళ్ల క్రితం వివాహం జరిగింది. క్షణికావేశంతో వెంకటలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబీకులు భోరున విలపించారు. సంఘటన స్థలానికి నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
క్షణికావేశంతో వివాహిత ఆత్మహత్య