
బస్సు డ్రైవర్ నిర్వాకంతో ప్రయాణికులకు గాయాలు
ఎటపాక: బస్సు డ్రై వర్ నిర్లక్ష్యం కారణంగా పలువురు ప్రయాణికులు గాయాల పాలయ్యారు. గోకవరం ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు కూనవరం నుంచి భద్రాచలం బయలుదేరింది. డ్రైవర్ అతివేగంగా బస్సును నడపడంతో ప్రయాణికులు అతనిని వారించారు. అయినప్పుటికీ డ్రైవర్ తీరు మార్చుకోలేదు. నెల్లిపాక సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద ఉన్న కల్వర్ట్‌ఎక్కుతున్న సమయంలో బస్సులోని ప్రయాణికులంతా సీట్లలోంచి బస్ టాప్ వరకు ఎగరడంతో చెల్లాచెదురయ్యారు.దీంతో పలువురు గాయపడ్డారు. కొందరి సెల్ ఫోన్లు కిందపడి పగిలిపోయాయి. ఓ బాలిక తల,చేతులపై తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారికి నెల్లిపాక పీహెచ్‌సీలో చికిత్స చేయించారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును నడపడం వల్లే తమకు గాయాలయ్యాయని పలువురు ప్రయాణికులు ఆర్టీసీ అధికారులకు,పోలీసులకు ఫిర్యాదు చేశారు. చేసారు. గాయపడిన ప్రయాణికుల పూర్తి వివరాలు తెలియలేదు.

బస్సు డ్రైవర్ నిర్వాకంతో ప్రయాణికులకు గాయాలు