
ఖైదీల సౌకర్యాలపై ఆరా
ఆరిలోవ(విశాఖ): కేంద్ర కారాగారాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ సోమవారం సందర్శించారు. జైలు అధికారులతో కలిసి లోపల ఖైదీల బ్యారక్‌లు, పరిసరాలు, పరిశుభ్రత తదితరాలను పరిశీలించారు. జైలు ఆస్పత్రి, జ్ఞాన సాగర్ గ్రంథాలయాన్ని పరిశీలించారు. ఖైదీల సంఖ్య, వారికి అందుతున్న సౌకర్యాలు, భోజనం, వైద్యం తదితరాల గురించి జైలు సూపరింటెండెంట్ ఎం.మహేష్‌బాబును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఖైదీలతో మాట్లాడి వారు ఏయే నేరాలు, కేసులపై వచ్చా రో అడిగి తెలుసుకున్నారు. మంచి ప్రవర్తన కలిగి ఉండాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో జైలు ఉప పర్యవేక్షణాధికారులు జవహర్‌బాబు, సాయిప్రవీణ్, జైలర్లు, చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ శ్రీనివాసరావు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.