
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యం
అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం
అరకులోయటౌన్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా నూతనంగా నియమితులైన పార్టీ మండల అధ్యక్షులు, కార్యదర్శులు, ఇతర నాయకులు పనిచేయాలని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం తెలిపారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో డుంబ్రిగుడ, అనంతగిరి మండలాల్లో నూతనంగా నియమితులైన పార్టీ అధ్యక్ష,ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ కోసం గ్రామ, మండల స్థాయిలో సమష్టిగా పనిచేయాలన్నారు. ప్రతిగ్రామంలో తాగునీరు, డ్రైనేజీలు, ఇతర సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపు వైఎస్సార్‌సీపీదేనని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యేను రెండు మండలాల నాయకులు దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బూత్ కమిటీ ఇన్‌చార్జి పాంగి విజయ్, పార్టీ మండల అధ్యక్షులు పాంగి పరశురామ్, కొర్రా సూర్యనారాయణ, ఉపాధ్యక్షులు గణపతి, పొట్టంగి రాంప్రసాద్, సోషల్ మీడియా కన్వీనర్ పాంగి నర్సింగరావు, కార్యదర్శులు కోటిబాబు, శంకర్‌రావు, హెచ్.బి.రామ్ నాయుడు, లీల, కిల్లో దొన్ను, మార్కెట్ కమిటీ చైర్మన్ కిల్లో రాజరమేష్ బోస్, మాజీ జెడ్పీటీసీ దూరు గంగన్న దొర, అనంతగిరి మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు పాగి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.