
10 కిలోల గంజాయి పట్టివేత
ఇద్దరు అరెస్టు, ఒకరు పరారీ
ముంచంగిపుట్టు: మండలంలో జోలాపుట్టు పంచాయతీ లబ్బూరు జంక్షన్ వద్ద శుక్రవారం అక్రమంగా తరలిస్తున్న 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అరెస్టు చేసినట్టు ఎస్‌ఐ జె.రామకృష్ణ తెలిపారు.ముందస్తు సమాచారంతో లబ్బూరు జంక్షన్ వద్ద తనిఖీ నిర్వహించినట్టు చెప్పారు. ఒడిశా వైపు నుంచి బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోడానికి ప్రయత్నించగా వారిలో ఇద్దరిని పట్టుకున్నట్టు తెలిపారు. ఒకరు పరారయ్యారని, బైక్‌కు కట్టి ఉన్న మూటలో గల 10కిలోల గంజాయి, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్‌ఐ తెలిపారు. నిందితులు ఒడిశా రాష్ట్రం కలహండి జిల్లా పట్న బ్లాక్ హుచ్చల పంచాయతీ గొంటిగూడ గ్రామానికి చెందిన హేమంత్ నాయక్,హుచ్చల గ్రామానికి చెందిన బైలోచన్ నాయక్‌లుగా గుర్తించినట్టు చెప్పారు. వీరిని శనివారం రిమాండ్‌కు పంపినట్టు తెలిపారు. ఒడిశా రాష్ట్రం పనసపుట్టు గ్రామానికి చెందిన దెబా హంతల్ అనే నిందితుడు పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు.ఈ తనిఖీలలో ఏఎస్‌ఐ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.