
ఘనంగా ధ్వజస్తంభం ప్రతిష్ట
పాడేరు : మినుములూరు పంచాయతీ సంగోడి గ్రామంలో పార్వతీ సమేత సిద్ధి సంగమేశ్వర స్వామీ ఆలయంలో బ్రహ్మకుమారీస్ సంస్థ ఆధ్వర్యంలో జీవ ధ్వజస్తంభం ప్రతిష్ట కార్యక్రమం వైభవంగా శనివారం జరిగింది. ఇందులో భాగంగా నవగ్రహాలు, కాల బైరవుడు, ఛండిశ్వరుడు, దక్షిణమూర్తి, జంట నాగులు తదితర విగ్రహా ప్రతిష్ట కార్యక్రమాలు జరిగాయి. వేదపండితుడు మామిళ్ళపల్లి వెంకటసుబ్బరాయ శర్మ సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఆలయంలో భారీ అన్నసమరాధన కార్యక్రమం నిర్వహించారు. ఏజెన్సీలోని పలు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో సంగోడి గ్రామంలో సందడి వాతవరణం నెలకొంది. కాకినాడ, కోనసీమ, రాజమండ్రి, అల్లూరి సీతారామరాజు జిల్లాల బ్రహ్మాకుమారీస్ సేవా కేంద్రాల సబ్ జోనల్ ఇన్‌చార్జి రాజయోగిని రజనీ దీదీ, పూజ్యపాద సత్యానంద గిరి స్వామిజీ తదితరులు పాల్గొన్నారు.