
విస్తృతంగా వాహన తనిఖీలు
వై.రామవరం: మండలంలోని పి.యర్రగొండ గ్రామ సమీపంలో సీఐ బి.నరసింహమూర్తి ఆదేశాల మేరకు స్థానిక ఎస్‌ఐ బి.రామకృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న సమాచారంతో ప్రధాన రహదారిలో వాహనాలను, వాటిలో సామగ్రిని తనిఖీచేశారు. అపరిచితులు, అనుమానితులపై నిఘా పెట్టారు. వాహన రికార్డులు, డ్రైవింగ్ లైసెన్స్‌లు సక్రమంగా లేనివారిపై కేసులు నమోదు చేశారు. సీఆర్‌పీఎఫ్ జి 42 బెటాలియన్ అదనపు పోలీసు బలగాల సహాయంతో అనుమానాస్పద ప్రదేశాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.