
వచ్చే నెల 10న జాతీయ లోక్ అదా
అరకులోయటౌన్: స్థానిక ప్రథమ శ్రేణి జుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో వచ్చేనెల 10న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్టు ఇన్‌చార్జి జడ్జి జి.స్వర్ణ తెలిపారు. శుక్రవారం స్థానిక కోర్టులో న్యాయవాదులు, అరకులోయ, అనంతగిరి, డుంబ్రిగుడ మండలాల పోలీస్, రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ కేసులు, చెక్ బౌన్స్, బ్యాంకింగ్, మోటర్ ప్రమాదాల నష్టపరిహారాల కేసులు, రాజీ పడదగిన క్రిమినల్ కేసులు పరిష్కరించుకోవచ్చని చెప్పారు. ఈ సమావేశంలో న్యాయవాదులు మురళీమోహన్, బి.సింహాచలం, ప్రభాకర్, పోలీస్, ఎకై ్సజ్ అధికారులు పాల్గొన్నారు.