
భారత వ్యవసాయ ఇంజినీర్ల సమాఖ్య డైరెక్టర్‌గా వెంగయ్య
రంపచోడవరం: భారత వ్యవసాయ ఇంజినీర్ల సమాఖ్య డైరెక్టర్‌గా 2025–26 సంవత్సరానికి పందిరిమామిడి వైఎస్సార్ ఉద్యాన పరిశోధన స్థానం అధిపతి డాక్టర్ పి.సి. వెంగయ్య ఎన్నికయ్యారు. జూమ్ ద్వారా జరిగిన సమావేశంలో సోమవారం ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత వ్యవసాయ ఇంజినీర్ల సమాఖ్య (ఐఎస్‌ఏఈ) ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తోందన్నారు. అన్ని రాష్ట్రాల్లో చాప్టర్స్ ఉన్నట్టు చెప్పారు. ప్రస్తుతం ప్రతి రాష్ట్రంలో వ్యవసాయ ఇంజినీరింగ్ విభాగం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు. వ్యవసాయంలో అధునాతన యంత్రాలు, సాంకేతికత కోసం కృషి చేస్తున్నట్టు చెప్పారు. దక్షిణ భారత దేశం నుంచి ఎన్నికై న ఏకై క శాస్త్రవేత్తగా డాక్టర్ వెంగయ్య గుర్తింపు పొందడం విశేషం.