
ప్రాథమిక వైద్యం..అందని ౖదెన్యం
గిరిజన విద్యాలయాల్లో విద్యార్థులకు ప్రాథమిక వైద్య సేవలు సకాలంలో అందడం లేదు. అనారోగ్యం బారిన
పడిన వారిని దూరంగా ఉన్న పీహెచ్‌సీలకు తరలించే సరికి వైద్య సేవలందడంలో జాప్యం జరుగుతుండడంతో
తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. విద్యార్థులకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తినప్పుడు ప్రాథమిక
వైద్యసేవలందించడానికి వీలుగాహెల్త్ వలంటీర్లను నియమించాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి
రాగానే గిరిజన సంక్షేమ విద్యా సంస్థల్లో హెల్త్ వలంటీర్లను నియమిస్తామని హామీ ఇచ్చిన టీడీపీ అధినేత
చంద్రబాబు నాయుడు దానిని విస్మరించారు. దీంతో విద్యార్థులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు.
నియామకం హామీ విస్మరించిన చంద్రబాబు
విద్యా సంవత్సరం ముగుస్తున్నా పట్టని పాలకులు
సాక్షి, పాడేరు:
ఎన్నికలకు ముందు అరకులోయలో వేలాది మంది గిరిజనుల సాక్షిగా గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో హెల్త్ వలంటీర్ల నియమిస్తామని చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. దీంతో 2024–25 విద్యా సంవత్సరం నుంచే హెల్త్ వలంటీర్ల సేవలు అందుబాటులోకి వస్తాయని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు భావించారు. అయితే సూపర్ సిక్స్ హామీల వలే హెల్త్ వలంటీర్ల నియామకాలను కూటమి ప్రభుత్వం పక్కన పెట్టేసింది. అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు గిరిజనులకు ఇచ్చిన హామీ ఊసే ఎత్తడం లేదు.విద్యాసంవత్సరం మరో 20రోజుల్లో ముగియనున్నా హెల్త్ వలంటీర్ల కోసం పాలకులెవరూ మాట్లాడడం లేదు.గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు.
సకాలంలో అందని ప్రాథమిక వైద్యం
జిల్లాలోని 206 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో 70వేల మంది గిరిజన విద్యార్థులు వసతితో కూడిన విద్యను పొందుతున్నారు. ప్రతి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలోను 3నుంచి 10వ తరగతి చదివే గిరిజన విద్యార్థులు 500 మంది వరకు ఉన్నారు. విద్యార్థులకు జ్వరం, ఇతర వ్యాధులు వచ్చినప్పుడు వెంటనే ప్రాథమిక వైద్యం చేయాలి.హెల్త్ వలంటీర్లు లేకపోవడంతో సకాలంలో ప్రాథమిక చికిత్స అందడం లేదు. దూరంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులకు హెచ్‌ఎంలు,ఉపాధ్యాయులు,వార్డెన్లు విద్యార్థులను తరలించి వైద్యసేవలు అందజేస్తున్నారు. మండల కేంద్రాల్లోని ఆశ్రమ పాఠశాలలకు ఆస్పత్రులు దగ్గరగా ఉంటున్నప్పటికీ మారుమూల ప్రాంతాల్లోని ఆశ్రమ పాఠశాల విద్యార్థులను ఆస్పత్రులకు తరలించడం ఉపాధ్యాయ వర్గాలకు కష్టంగా మారుతోంది.దీంతో సకాలంలో వైద్యసేవలు అందక గిరిజన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్యం సోకితే కొద్ది రోజులు మాత్రమే విద్యార్థులు ప్రభుత్వ వైద్యశాలల్లో ఉంటున్నారు.ఆ తరువాత తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకుపోతున్నారు. ఆశ్రమ పాఠశాలల్లో సిక్ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నా విద్యార్థులు బస చేయడానికే పరిమితమవుతున్నాయి. సిక్ రూమ్‌లో గిరిజన విద్యార్థుల వైద్యసేవల పర్యవేక్షణకు హెల్త్ వలంటీర్లే కీలకం. కూటమి ప్రభుత్వం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల ప్రాథమిక వైద్యాన్ని నిర్లక్ష్యం చేయడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇబ్బందులకు గురవుతున్న విద్యార్థులు
కొన్ని సంఘటనలు
గత ఏడాది ఆగస్టు 30వ తేదీ రాత్రి డుంబ్రిగుడ మండలం జామిగుడ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 90మంది గిరిజన బాలికలకు వాంతులతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రికి అంబులెన్స్‌ల ద్వారా తరలించారు. మూడు రోజుల పాటు కిల్లోగుడ పీహెచ్‌సీ వైద్య సిబ్బంది పాఠశాలలో మకాం వేసి వైద్యసేవలందించారు.
ఈ ఏడాది మార్చి 3వ తేదీ రాత్రి పెదబయలు మండలంలోని తురకలవలస గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో కడుపునొప్పి,వాంతులతో 35మంది గిరిజన బాలికలకు అస్వస్థతకు గురయ్యారు. పెదబయలు,గోమంగి ఆస్పత్రుల వైద్యబృందాలతో పాఠశాలలోనే రెండు రోజుల పాటు వైద్యశిబిరాలు నిర్వహించారు. ఇలా పాఠశాలల్లో విద్యార్థులు తరచూ అనారోగ్యం పాలవుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం గమనార్హం.

ప్రాథమిక వైద్యం..అందని ౖదెన్యం

ప్రాథమిక వైద్యం..అందని ౖదెన్యం