సీలేరు: సీలేరు జల విద్యుత్ కేంద్రం విద్యుత్ ఉత్పత్తిలో రికార్డులపై రికార్డులు సృష్టిస్తోందని ఈఈ రాజేంద్రప్రసాద్ తెలిపారు. గత బుధవారం 5.126 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి ఆల్ టైం రికార్డు సృష్టించగా, తాజాగా గురువారం ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు 5.325 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి రికార్డు నెలకొల్పిందని చెప్పారు. ఈ స్థాయిలో ఉత్పతి సాధించి,రికార్డు నెలకొల్పడం గొప్ప విషయమని ఈఈ తెలిపారు. జెన్‌కో ఎండీ కె.వి.ఎన్. చక్రధర్‌బాబు నేరుగా ఫోన్ చేసి అధికారులు,ఇంజినీర్లు, కార్మికులను అభినందించారని చెప్పారు.