
తాగునీటి సౌకర్యం కల్పనకు ప్రత్యేక చర్యలు
ముంచంగిపుట్టు: జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా గ్రామాల్లో తాగునీటి సౌకర్యం కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ రాజేష్ తెలిపారు.మండలంలోని కించాయిపుట్టు,కిలగాడ పంచాయతీల్లో జేజేఎం ద్వారా నూతనంగా మంజూరైన తాగునీటి పథకాల ఏర్పాటుకు అనుకూలమైన ప్రదేశాలను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కించాయిపుట్టు పంచాయతీలో జే జేఎం ద్వారా రూ.9లక్షలతో దారపల్లి, రూ.7.70 లక్షలతో వర్కుగుమ్మి, రూ.7.40 లక్షలతో మర్రిపుట్టు, కిలగాడ పంచాయతీలో రూ.7.60 లక్షలతో తరిగెడ, రూ.5.3 లక్షలతో ఊరిపూజారిమెట్ట, రూ.7.9 లక్షలతో మల్కరిపుట్టు, రూ.8.3 లక్షలతో చెరువుపాకల గ్రామాల్లో తాగునీటి పథకాలు ఏర్పాటు చేయనున్నామని, త్వరలోనే పనులు మొదలు పెడతామని తెలిపారు.