
జనావాసంలోకి చుక్కల జింక
రాజవొమ్మంగి: సుమారు 4 సంవత్సరాల వయస్సు గల చుక్కల జింక గురువారం మండలంలోని సూరంపాలెం గ్రామంలోకి వచ్చింది. పరుగుపరుగున వచ్చిన ఆ జింక జనాలను చూసి భయంతో ఓ ఇంట్లోకి చొరబడింది. ఇంటి యజమాని రాజేశ్వరి తలుపులు మూసి అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీ క్షేత్రాధికారి ఉషారాణి వచ్చి జింకను పరిశీలించారు. ఎటువంటి గాయాలు లేవని నిర్ధారించుకొని ఆ జింక తిరిగి సమీప అడవిలోకి వెళ్లిపోయేలా చర్యలు తీసుకున్నారు. అడవులు అంతరించి పోతుండడం, నీటి వనరులు అందుబాటులో లేకపోవడంతో వన్యప్రాణులు ఇలా జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయని స్థాని కులు అభిప్రాయపడుతున్నారు.