ఇదే నిదర్శనం.. | - | Sakshi
Sakshi News home page

ఇదే నిదర్శనం..

Published Sun, Apr 13 2025 2:13 AM | Last Updated on Sun, Apr 13 2025 2:13 AM

ఇదే న

ఇదే నిదర్శనం..

స్వాతంత్య్రం సిద్ధించిన నాటి నుంచి ఏజెన్సీలో మారుమూల గ్రామాలకు రోడ్లు,రవాణా సౌకర్యం కనీసస్థాయిలో అందుబాటులో లేవు. అనారోగ్యానికి గురైనవారిని ఆస్పత్రులకు తరలించడానికి డోలీమోతే శరణ్యం.మండల కేంద్రాలకు చేరుకునేందుకు గుర్రాలు, కాలినడకతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి. అలాంటి స్థితిలో అధికారం చేపట్టిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో గిరిజన గ్రామాలు ప్రగతిబాట పట్టాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లా వ్యాప్తంగా రూ.51,626.96 లక్షల వ్యయంతో 295 పక్కా తారురోడ్లను నిర్మించి, సుమారు 1,000 గ్రామాలకు రవాణా వ్యవస్థను మెరుగుపరిచారు. అయితే ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ఇటీవల జిల్లా పర్యటనలో మాట్లాడుతూగత ప్రభుత్వ హయాంలో ఒక్కరోడ్డు కూడా నిర్మించలేదని విమర్శలు చేయడంపైఈ ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఐదేళ్లు ప్రగతి పథం..

సాక్షి,పాడేరు: రాష్ట్రం విడిపోయిన తరువాత 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గిరిజన ప్రాంతాల అభివృద్ధిని పూర్తిగా విస్మరించారు. రోడ్ల నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై కనీస స్థాయిలో కూడా దృష్టి సారించలేదు. 2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అప్పటి సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి మారుమూల గ్రామాల అభివృద్ధికి ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా రోడ్ల నిర్మాణంపైనే ప్రత్యేక దృష్టి సారించారు. 2019 నుంచి 2024 సంవత్సరం వరకు ఐదేళ్ల పాలనలో జిల్లాలోని రంపచోడవరం,చింతూరు,పాడేరు డివిజన్ల పరిధిలో మారుమూల గ్రామాల్లో తారు రోడ్ల నిర్మాణానికి భారీగా నిధులు వెచ్చించడమే కాకుండా రవాణా సదుపాయం కల్పించడానికి చర్యలు తీసుకున్నారు.మారుమూల గ్రామాల రోడ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్దమొత్తంలో నిధులు రప్పించడంలోను అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం విజయం సాధించింది. రోడ్ల నిర్మాణం పెద్ద ఎత్తున జరగడంతో గిరిజనులకు రవాణా సౌకర్యం మెరుగుపడింది. దీంతో మారుమూల పల్లెలకు సైతం వాహనాలు రయ్‌ రయ్‌ మంటూ పరుగులు తీస్తున్నాయి. మావోయిస్టు ప్రభావిత గ్రామాలు సైతం అభివృద్ధి చెందాయి. 108,104 వాహనాలు,తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌,ఇతర అంబులెన్స్‌లు కూడా సకాలంలో మెరుగైన సేవలు అందిస్తున్నాయంటే అవన్నీ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జరిగిన రోడ్ల అభివృద్ధి వల్లేనని గిరిజనులు చెబుతున్నారు.

గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో..

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన పాడేరు డివిజన్‌ చింతపల్లి, జీకే వీధి, కొయ్యూరు, జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లోని మారుమూల గ్రామాల్లో ఎస్‌సీఏ నిధులతో గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్‌శాఖ రోడ్లు నిర్మించింది. ఎస్‌సీఏ పథకానికి సంబంధించి వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాలనతో పాడేరు నియోజకవర్గంలో రూ.2,457లక్షల వ్యయంతో 36 రోడ్లు, అరకు నియోజకవర్గంలో రూ.2,721.50 లక్షలతో 23 రోడ్లు నిర్మించారు. ఇవన్నీ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని రోడ్లు కావడంతో గిరిజనులకు రవాణా పరంగా ఎంతో మేలు జరిగింది. 59 రోడ్ల నిర్మాణాలకు మొత్తం రూ.5,178.50 లక్షలను గత ప్రభుత్వం ఖర్చుపెట్టింది.

పంచాయతీరాజ్‌ విభాగంలో..

పాడేరు, రంపచోడవరం,అరకులోయ నియోజకవర్గాల్లో పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ విభాగం ద్వారా భారీ ఎత్తున రోడ్ల నిర్మాణాలు జరిగాయి. రూరల్‌ కనెక్టివిటీకి సంబంధించి ఆర్‌సీపీఎల్‌డబ్ల్యూఈ పథకంలో 74 రోడ్ల నిర్మాణాలకు రూ. 29,682.7 లక్షలు, పీఎంజీఎస్‌వై ప్రాజెక్టులో 61 రోడ్ల నిర్మాణాలకు రూ.3431.39లక్షలు,ఏఐఐబీ పథకంలో 101రోడ్ల నిర్మాణాలకు రూ.13,334.00 లక్షలను ఖర్చు చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఇంత పెద్ద ఎత్తున రోడ్ల నిర్మాణాలు జరిగితే ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ తప్పుడు విమర్శలు చేయడం తగదని మెజార్టీ గిరిజనులు హితవు పలుకుతున్నారు.

కారడవిలో రింగ్‌ రోడ్డు

పెదబయలు మండలంలోని మారుమూల ఇంజరి పంచాయతీ కొండ్రుం గ్రామం ఒకప్పుడు అత్యంత మావోయిస్టు ప్రభావిత అటవీ ప్రాంతం. ఈ ప్రాంతంలో నిత్యం మావోయిస్టులు,పోలీసుల బూటుచప్పుళ్లే వినిపించేవి. ఈ గ్రామానికి కనీసం కాలిబాట కూడా సక్రమంగా లేకపోవడంతో గతంలో అనేకసార్లు ఉమ్మడి జిల్లాలోని కలెక్టర్‌లు,ఎస్పీలు,ఇతర అధికారులు హెలికాప్టర్‌లో వెళ్లే పరిస్థితి.ఇంజరి పంచాయతీలోని గ్రామాలకు ఎలాగైనా రోడ్లు వేసి రవాణా సౌకర్యం కల్పించాలని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జి.మాడుగుల మండలం మద్దిగరువు నుంచి కండ్రుం వరకు రోడ్డు నిర్మాణానికి రూ.1,245.58 లక్షలు,పెదబయలు మండలంలోని గుల్లెలు నుంచి ఇంజరి మీదుగా కండ్రుం వరకు రహదారి నిర్మాణానికి రూ.1,494 లక్షలు ఖర్చుపెట్టింది. ప్రమాదకర గెడ్డలపై వంతెనల నిర్మాణం చేపట్టడంతో ఈ మారుమూల మావోయిస్టు ప్రభావిత పల్లెల్లో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వెలుగులు నింపింది. ఇప్పుడు ఏకంగా అధునాతన వాహనాలు కూడా ఈ రింగ్‌రోడ్డులో ప్రయాణం చేస్తున్నాయి.ఈ జన్మకు రోడ్డు చూడలేం అనుకున్న ఇంజరి పంచాయతీలోని గిరిజనులకు రింగ్‌ రోడ్డు నిర్మాణంతో మేలు జరిగింది.వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన మేలు మరవబోమని గిరిజనులంతా అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వెంటే నడుస్తున్నారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మారుమూల గ్రామాల రోడ్లకు మోక్షం

మావోయిస్టు ప్రభావితప్రాంతాలకు పక్కా రహదారులు

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలోనే రోడ్డు కల నెరవేరింది

వై.ఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి సీఎం అయిన తరువాత దశాబ్దాల నాటి రోడ్డు కల నెరవేరింది.మేము బతికుండగా మా గ్రామానికి రోడ్డు నిర్మి స్తారని అనుకోలేదు. గత ప్రభుత్వంలో గుల్లేలు నుంచి ఇంజరి,కోండ్రుం మీదుగా తారురోడ్డు, జి.మాడుగుల మండలం బొయితిల గ్రామం జక్కం మీదుగా కోండ్రుం వరకు రింగురోడ్డు నిర్మాణం జరిగింది.గతంలో ఎవరూ ఇంజరివైపు చూసిన దాఖలాలు లేవు. మావో యిస్టుల అడ్డగా పేరుపొందిన ఇంజరికి గత వై.ఎస్‌.జగన్‌ ప్రభుత్వంలో రవాణా సదుపా యం కల్పించారు. ఆయనకు మేం రుణపడి ఉంటాం.

– వంతాల నాగేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ, ఇంజరిసెగ్మెంట్‌, పెదబయలు మండలం

రూ.51626.96 లక్షలతో

295 ప్రగతి బాటలు

మారుమూల కొండ్రుంకు

రింగ్‌ రోడ్డు నిర్మాణం

అటవీ ప్రాంతంలో

నేడు కార్లు రయ్‌రయ్‌

రోడ్డు నిర్మాణానికి ముందు

మద్దిగరువు నుంచి కుండ్రుంకు వెళ్లే దారి (ఫైల్‌)

ఉన్నతాధికారులుహెలికాప్టర్‌లోనే వచ్చే వారు..

రోడ్డు సదుపాయం లేకపోవడంతో గతంలో ఇంజరి,గిన్నెలకోట పంచా యతీలకు ఉన్నతాధికారు లు హెలికాప్టర్‌పై, అధికారులు, ఉపాధ్యాయులు గుర్రాలపై వచ్చేవారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో రెండు గ్రామ పంచాయతీలను కలుపుతూ రహదారులు నిర్మించడంతో రవాణా కష్టాలు తీరాయి.

– గడుతూరి రామన్న పడాల్‌, మాజీ సర్పంచ్‌ గిన్నెలకోట. పెదబయలు మండలం.

నాడు గుర్రాలే ఆధారం..

గతంలో ఇంజరి, గిన్నెల కోట,జామిగుడ, కుంతు ర్ల గ్రామ పంచాయతీలకు రోడ్డు సదుపాయం లేదు. రేషన్‌ సరుకులు తీసుకోడానికి, పండించి న పంటలు అమ్ముకోడా నికి గుర్రాలపై రాకపోకలు సాగించేవారం. అత్యవసర పరిస్థితుల్లో గుర్రాలు, డోలీ సహాయంతో రోగులను ఆస్పత్రికి తరలించే పరిస్థితి ఉండేది. నేడు గ్రామాలకు ద్విచక్ర వా హనాలు,ఆటోలు,జీపులు ఇతర అన్నివాహ నాలు వస్తున్నాయి.– తెరవాడ అన్నమ్మ, సర్పంచ్‌ జామిగుడ, పెదబయలు మండలం

ఇదే నిదర్శనం..1
1/6

ఇదే నిదర్శనం..

ఇదే నిదర్శనం..2
2/6

ఇదే నిదర్శనం..

ఇదే నిదర్శనం..3
3/6

ఇదే నిదర్శనం..

ఇదే నిదర్శనం..4
4/6

ఇదే నిదర్శనం..

ఇదే నిదర్శనం..5
5/6

ఇదే నిదర్శనం..

ఇదే నిదర్శనం..6
6/6

ఇదే నిదర్శనం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement