
కేరళలో కుటుంబసభ్యుల మధ్య పుట్టిన రోజు వేడుకలు జరుపుకొంటున్న ఎమ్మెల్యే ధర్మశ్రీ
చోడవరం: సామాజిక కార్యక్రమాలతో ప్రభుత్వ విప్, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పుట్టిన రోజు వేడుకలు సోమవారం వాడవాడలా ఎంతో సందడిగా జరిగాయి. నియోజకవర్గమంతా ఆయన పుట్టిన రోజు వేడుకలతో కార్యకర్తలు పలు కార్యక్రమాలు నిర్వహించారు. చోడవరం మండలంలో భారీ ఏర్పాట్ల మధ్య నిర్వహించిన వేడుకల్లో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ పాల్గొన్నారు. కేక్ కట్‌చేసి అందరికీ స్వీట్లు పంచారు. ప్రజల మనిషిగా జనం హృదయాల్లో ఎమ్మెల్యే ధర్మశ్రీ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని అన్నారు. అంతకు ముందు చోడవరం ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీచేశారు. ఈ వేడుకల్లో డీసీఎంఎస్ చైర్మన్ పల్లా నర్సింగరావు, పార్టీ జిల్లా ప్రతినిధి పప్పల జయదేవ్, ఎంపీపీ గాడి కాసు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఏడువాక సత్యారావు, మండల అధ్యక్షుడు దొడ్డి వెంకట్రావు, సర్పంచ్‌లు బండి నూకాలమ్మ శ్రీను, మూడెడ్ల శంకరావు, పోతల జానకీప్రసాద్, కొరకూటి భోగేష్, ఉగ్గిన నాగబాబు, శిరుచోళ్ల గణపతినాయుడు, శానాపతి రాజశేఖర్, బలిరెడ్డి నాగేశ్వరరావు, బూరే మాణిక్యం, శీరంరెడ్డి వెంకటరమణ, దంతులూరి శ్రీనివాసరాజు, బీసీ సెల్ అధ్యక్షుడు మొల్లి సోమునాయుడు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఓరుగంటి నెహ్రూ, మాజీ జెడ్పీటీసీ బొడ్డేడ సూర్యనారాయణ పాల్గొన్నారు. కేరళలోని తిరువనంతపురంలో ఎమ్మెల్యే ధర్మశ్రీ ఉండటంతో అక్కడ అతని కుటుంబ సభ్యుల మధ్య కేక్ కట్ చేసి పుట్టిన రోజు వేడుకలు చేసుకున్నారు.

మేజర్ పంచాయితీ వడ్డాదిలో మొక్కలు నాటుతున్న వైఎస్సార్‌సీపీ నాయకులు
Comments
Please login to add a commentAdd a comment