సంక్షోభంలో వ్యవసాయ రంగం
అనకాపల్లి టౌన్: వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలంటే జస్టిస్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాల్సిందేనని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి తెలిపారు. స్థానిక వై.విజయ్‌కుమార్ హాల్‌లో మంగళవారం మాజీ శాసనసభ్యుడు కోడుగంటి గోవిందరావు 11వ వర్ధంతి సందర్భంగా ‘వ్యవసాయరంగం–పెనుసవాళ్లు’ అనే అంశంపై జిల్లా స్థాయి సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ప్రస్తుతం వ్యవసాయరంగం ప్రపంచవ్యాప్తంగా సంక్షోభంలో పడిందని, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ రైతు సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. సరళీకృత ఆర్థిక విధానాల వలన పారిశ్రామికీకరణ వలన వ్యవసాయ రంగం దెబ్బతిన్నదని, పారిశ్రామిక, రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం భూమిని వాడుకోవడం వలన వ్యవసాయ భూమి కనుమరుగైపోతుందన్నారు. వ్యవసాయ రంగానికి గోవిందరావు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రాజాన దొరబాబు, మాకిరెడ్డి రామునాయుడు, జిల్లా కార్యవర్గ సభ్యులు సన్యాసిరావు, రెడ్డిపల్లి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.
జస్టిస్ స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయడమే పరిష్కారం
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి
Comments
Please login to add a commentAdd a comment