సోషల్ మీడియాతో అద్భుతాలు
● యువతకు మార్గనిర్దేశం ● వివిధ వర్గాలకు అవగాహన ● ఎస్పీ తుహిన్ సిన్హా పిలుపు
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ తుహిన్ సిన్హా
అనకాపల్లి: సమాజాన్ని సురక్షితంగా, చట్టపరంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని, సోషల్ మీడియాను ఉపయోగించి యువతను సరైన దిశలో నడిపించేందుకు కృషి చేయాలని ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. తన కార్యాలయంలో మంగళవారం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో సమావేశం నిర్వహించారు. గంజాయి అక్రమ రవాణా, వినియోగం నివారణ, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, మహిళలు బాలల హక్కులు, రోడ్డు భద్రతా నియమాలు, సైబర్ నేరాలపై విస్తృతంగా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. పోలీస్ శాఖ సహకారంతో ఇన్‌ఫ్లుయెన్సర్లు కీలక భూమిక పోషించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బీ డీఎస్పీ బి.అప్పారావు, ట్రెయినీ డీఎస్పీ ఎం.వి.కృష్ణ చైతన్య, ఐటీ కోర్ ఎస్‌ఐ సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
మహిళా స్టేషన్ తనిఖీ
పట్టణంలోని మహిళా పోలీస్ స్టేషన్‌ను మంగళవారం రాత్రి ఎస్పీ తుహిన్ సిన్హా పరిశీలించారు. మహిళలు ఇచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, రక్షణకు భద్రత చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. అనంతరం ఎన్టీఆర్ ఆస్పత్రిలో డి–అడిక్షన్ సెంటర్‌ను సందర్శించారు. సెంటర్‌లో చికిత్స పొందుతున్న రోగుల ఆరోగ్య పరిస్థితి, చికిత్సా విధానాల గురించి వైద్యుడు కృష్ణ చైతన్యతో మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment