జల దృక్పథానికి జేజేలు
● ‘చెట్టుపల్లి’ విద్యార్థుల నమూనాకు ప్రాంతీయ అవార్డు
నర్సీపట్నం: సీపీఆర్ పర్యావరణ విద్యా కేంద్రం చైన్నె, విప్రో సంస్థ సంయుక్తంగా జాతీయస్థాయిలో నిర్వహించిన ‘సుస్థిర జీవన విధానం’ పోటీలో నర్సీపట్నం మండలం, చెట్టుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రూపొందించిన జల దృక్పథం నమూనా ప్రాంతీయ అవార్డు సాధించింది. నిర్వాహకులు సూచించిన సుస్థిరత–నీరు, సుస్థిరత–వ్యర్ధాల నిర్వహణ, సుస్థిరత జీవవైవిధ్యం అంశాలపై తొమ్మితో తరగతి విద్యార్థిలు వెలంకాయల సాయి శివాని, పండూరి మనోజ్ కుమార్, మోక్ష మాధురి కౌశిక్ బృందం జల దృక్పథం నమూనాను రూపొందించింది. మంగళవారం అమరావతిలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు, పాఠశాల విద్య అకడమిక్ కోఆర్డినేటర్ విజయలక్ష్మి చేతుల మీదుగా విద్యార్థులు, వారికి మార్గదర్శిగా వ్యవహరించిన ఉపాధ్యాయుడు రాజగోపాల్ ప్రశంసా పత్రం, నగదు బహుమతి అందుకున్నారు. విద్యార్థి దశ నుంచి పర్యావరణం పట్ల ఆసక్తి పెంచే కార్యక్రమాలు భవిష్యత్తు అవసరాలకు బాగా ఉపయోగపడతాయని విద్యార్థులకు దిశ నిర్దేశం చేసినట్లు ఉపాధ్యాయులు రాజగోపాల్ తెలిపారు.
జల దృక్పథం నమూనా నీటి కొరతను నివారించేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు. 10 వేల లీటర్ల వరకు భారీ స్థాయిలో నీటిని వినియోగించే జనావాసాలు, అపార్ట్‌మెంట్లలో.. మురుగునీటిని మంచి నీటిగా శుభ్రపరిచే ప్రక్రియను రూ.85 వేల వ్యయంతో జల దృక్పథం కాన్సెప్ట్‌తో చేపట్టవచ్చని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment