ఫార్మర్ రిజిస్ట్రీని తనిఖీ చేసిన కలెక్టర్
ఫార్మర్ రిజిస్ట్రీ గురించి రైతుకు వివరిస్తున్న కలెక్టర్ విజయ కృష్ణన్
కె.కోటపాడు: రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. మేడిచర్ల గ్రామంలో మంగళవారం సాయంత్రం ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా రైతు రొంగలి దేముడుకు చెందిన పంట వివరాలను వ్యవసాయ, రెవెన్యూ శాఖల సిబ్బంది ఈ–పంటలో నమోదు చేశారు. ఆ వివరాలను సూపర్ చెక్‌లో భాగంగా ఆమె తనిఖీ చేశారు. మినుము పంట వేసిన రైతు దేముడు వివరాలు సరిపోవడంతో ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. సాగులో ఉన్న పిల్లిపెసర, జనుము పంటల గురించి కలెక్టర్ జిల్లా వ్యవసాయాధికారి మోహన్‌రావును అడిగి తెలుసుకున్నారు. రైతులకు వ్యవసాయశాఖ ద్వారా అందించే రాయితీ, పంట పెట్టుబడి, దిగుబడి గురించి ఆరా తీశారు. తహసీల్దార్ రమేష్‌బాబు, ఎంపీడీవో సాంబశివరావు, మండల వ్యవసాయాధికారి సోమశేఖర్, ఏపీవో అప్పలరాజు, ఏఈవో లైలాదేవి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment