మెగా డీఎస్సీ విడుదల చేయాలని వినతి
తుమ్మపాల: ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలంటు ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి వియ్యపు రాజు డిమాండ్ చేశారు. డీఎస్సీ నోటిషికేషన్ విడుదలపై ఏఐవైఎఫ్ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా కలెక్టర్ కార్యాలయంలో డీఆర్వో సత్యనారాయణరావుకు బుధవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వియ్యపు రాజు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం డీఎస్సీ పైనే అంటూ హమీ ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు నేటికీ నోటిఫికేషన్ విడుదల చేయకుండా లక్షలాది మంది నిరుద్యోగులను మోసం చేస్తున్నారన్నారు. లక్షలు చెల్లిస్తు కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకుంటున్న నిరుద్యోగులు నిరీక్షిస్తున్నారని అన్నారు. పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. అనంతపురం, కర్నూలు, కడప, నెల్లూరు, ప్రకాశం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలకు పోస్టుల ఎంపిక విషయంలో అన్యాయం జరిగిందని, తక్కువ పోస్టులు మంజూరు చేస్తారని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారన్నారు. అభ్యర్థులకు న్యాయం జరిగేలా పోస్టులు మంజూరు చేస్తూ నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు డొక్కరి హరీష్, నాయకుడు బి.బాబ్జి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment