
తుమ్మపాల: వృద్ధులు, ఒంటరి మహిళలకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తున్న పింఛన్ భరోసా మరింత పెరిగింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ నెల నుంచి రూ.3 వేలు చొప్పున పింఛన్ అందిస్తున్నారు. దీంతో బడుగు, బలహీన వర్గాలకు చెందిన లబ్ధిదారులకు పింఛన్ పెంపు వరంలా మారింది. ప్రతి నెలా ఒకటో తేదీనే వలంటీర్ల ద్వారా ఇంటి వద్దే అందించడం వృద్ధులకు, రోగులకు మరింత ఆనందాన్నిస్తోంది.
జిల్లాలో 2.68 లక్షల పింఛన్‌దారులు
వృద్ధులు, వితంతువులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు, మత్స్యకారులు, సంప్రదాయ చెప్పులు కుట్టేవారు, వికలాంగులు, ట్రాన్స్‌జెండర్లు, డప్పు కళాకారులు తదితర కేటగిరీలో జిల్లాలో 2,64,702 మంది పింఛన్ లబ్ధిదారులున్నారు. ఈ నెల కొత్త పింఛన్లు 2,949 మందికి మంజూరయ్యాయి. దీంతో పింఛన్ లబ్ధిదారుల సంఖ్య జిల్లాలో 2,67,651 మందికి చేరుకుంది. వీరిలో రూ.500 పింఛన్ అందుకుంటున్న అభయహస్తం లబ్ధిదారులు, రూ.10 వేలు అందుకుంటున్న డయాలసిస్ రోగులూ ఉన్నారు.
ఇప్పటి వరకు రూ.2,750 చొప్పున అందుకుంటున్న లబ్ధిదారులకు ఈ నెల నుంచి రూ.3 వేలు చొప్పున పింఛన్ లబ్ధిని ప్రభుత్వం పెంచింది. దీంతో ఈ నెల జిల్లాలో రూ.77.91 కోట్ల నిధులు పింఛన్ల పంపిణీకి విడుదల చేశారు. ఇందులో కొత్త పింఛన్ల వ్యయమే రూ.88.47 లక్షలు.
నియోజకవర్గాల వారీగా పింఛన్‌దారులు
నియోజకవర్గం కొత్త పాత
పింఛన్లు పింఛన్లు
అనకాపల్లి 504 33,610
చోడవరం 532 45,750
మాడుగుల 273 42,149
నర్సీపట్నం 519 42,974
పాయకరావుపేట 439 47,391
యలమంచిలి 458 37,932
పెందుర్తి 224 14,896
మొత్తం 2,949 2,64,702
జిల్లాలో 2,67,651 మందికి పింఛన్ కానుక
పంపిణీ ప్రారంభించిన కలెక్టర్, ప్రభుత్వ విప్
తుమ్మపాల: అర్హులైన ప్రతి ఒక్కరికీ నెలకు రూ.3 వేల వంతున ప్రభుత్వం సామాజిక పింఛన్లు అందిస్తోందని కలెక్టర్ రవి పట్టాన్‌శెట్టి అన్నారు. కాకినాడ నుంచి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన పింఛన్ కానుక పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, లబ్ధిదారులతో కలిసి ఆయన వీక్షించారు. అనంతరం లబ్ధిదారులకు పింఛన్ల సొమ్మును చెక్కు రూపంలో అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాది పెంచిన రూ.250తో కలిపి రూ.3 వేలను 2 లక్షల 67 వేల 651 మంది లబ్ధిదారులకు అందజేస్తున్నామని, మొత్తం రూ.77 కోట్ల 90 లక్షల 94 వేలు పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. వీటిలో వృద్ధాప్య పెన్షన్లు లక్షా 40 వేల 633, వితంతు పింఛన్లు 64,891, దివ్యాంగులు 31,461, చేనేత కార్మికులు 2,557, అభయ హస్తం 12,099, మత్స్యకారులు 3,411, ఒంటరి సీ్త్ర 5,830, కల్లుగీత పనివారు 2,469, ట్రాన్స్‌జెండర్స్ 23, డప్పు కళాకారుల పింఛన్లు 1320 ఉన్నాయన్నారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ సీఎం జగన్ ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏటా రూ.250 చొప్పున క్రమంగా రూ.3 వేల వరకు పెంచుకుంటూ పోతామని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని, అవ్వా తాతలు, అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములకు బాసటగా నిలిచారన్నారు. డీఆర్డీఏ పీడీ శచీదేవి, గ్రామ, వార్డు సచివాలయ ప్రత్యేకాధికారి మంజులవాణి, సీపీవో జి.రామారావు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
గ్రామాల్లో ఒంటరి మహిళలకు కాసింత భరోసా పింఛన్. చాలా చోట్ల వృద్ధులకు వారి కుటుంబంలో అంతో ఇంతో ఆదరణ దొరుకుతుందంటే అది పింఛన్ వల్లేనంటే అతిశయోక్తి కాదు. గత ప్రభుత్వంలో ఇచ్చే అరకొర పింఛన్ దేనికీ సరిపోని పరిస్థితి. కొత్తగా పింఛన్ కావాలంటే లబ్ధిదారుల్లో ఎవరైనా చనిపోతే తప్ప, వచ్చేది కాదు. ప్రస్తుత ప్రభుత్వంలో ఆ తిప్పల్లేవు. సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు రూ.3 వేలకు పింఛన్ పెంచారు. కొత్త పింఛన్లను కూడా మంజూరు చేశారు. పెంచిన పింఛన్‌తోపాటు, కొత్త పింఛన్ల పంపిణీని బుధవారం ప్రారంభించారు.
పింఛన్‌దారులకు సంక్రాంతి కానుక రూ.3 వేలు పింఛన్
జనవరి నెల పింఛన్ల లబ్ధి రూ.77.90 కోట్లు
ఈ ఏడాది జిల్లాలో కొత్త పింఛన్లు 2,949
Comments
Please login to add a commentAdd a comment